Vizag Beach: వైజాగ్ బీచ్ లో వెనక్కి వెళ్లిన సముద్రం.. తీరంలో బయటపడ్డ రాళ్లపై టూరిస్టుల సందడి

Vizag RK Beach Sea went back nearly 400 meters

--


బీచ్ లో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా పిల్లల్లా మారిపోతారు. సరదాగా నీళ్లల్లో ఆడుతూ సేదతీరుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళితే.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే..? అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Vizag Beach
RK Beach
Sea went back
Offbeat
  • Loading...

More Telugu News