Pithapuram: పిఠాపురంలో భారీ జాబ్‌మేళా .. 783 మందికి ఉద్యోగాలు

mega job mela in pitapuram

  • పిఠాపురంలో మెగా జాబ్‌మేళాకు హజరైన 2,700 మంది యువతీ యువకులు
  • ఇంటర్వ్యూలు నిర్వహించిన 40 కంపెనీల ప్రతినిధులు
  • 783 మందికి నియామక ఉత్తర్వులు 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ మేళాకు 2,790 మంది నిరుద్యోగ యువతీయువకులు హజరయ్యారు. 40 కంపెనీల్లో ఉద్యోగాలకు ఆయా కంపెనీ ప్రతినిధులు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు వేతనం లభించే ఉద్యోగాలకు 783 మందిని ఎంపిక చేశారు. 

ఎంపికైన వారికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నియామక ఉత్తర్వులు అందజేశారు. జాబ్‌మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులకు నిర్వహకులు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. నిరంతరాయంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

More Telugu News