Anitha: ఆయన తీరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్టుగా ఉంది: అనిత

Anitha fires on Jagan

  • మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి జగన్ నవ్వుతారన్న అనిత
  • ఫార్మా కంపెనీ ప్రమాదం పరిహారంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శ
  • ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇంకా పరిహారం అందలేదని మండిపాటు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ వ్యవహరిస్తున్న తీరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్టుగా ఉందని మండిపడ్డారు. మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి నవ్వుతారని, క్షతగాత్రుల వద్దకు వెళ్లి సరదాలు చేస్తారని ఎద్దేవా చేశారు. 

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం పరిహారంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అనిత అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 17 మంది మృతుల కుటుంబాలకు, 36 మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ ద్వారా పరిహారం పంపించినట్టు చెప్పారు. 

వైసీపీ హయాంలో చోటుచేసుకున్న పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా... ఇప్పటికీ ముగ్గురు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందలేదని దుయ్యబట్టారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రూ. 150 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రియాక్టర్లు పాడైనప్పుడు ఆయా సంస్థల యాజమాన్యాలు వెంటనే స్పందించి రిపేర్లు చేయిస్తే ప్రమాదాలు జరగవని... ఒక్కో రియాక్టర్ మరమ్మతుకు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చవుతుందని చెప్పారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా రాష్ట్ర స్థాయిలో హైలెవెల్ కమిటీ వేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News