Chiranjeevi: నిర్మాత అశ్వినీదత్ కు శంఖాన్ని కానుకగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi gifts producer Aswinidutt a Conch

  • బ్లాక్ బస్టర్ చిత్రం ఇంద్ర రీ రిలీజ్
  • చిత్రబృందాన్ని తన ఇంట ఘనంగా సత్కరించిన చిరంజీవి
  • చిరంజీవి ఇచ్చిన కానుక పట్ల సంతోషం వ్యక్తం చేసిన అశ్వినీదత్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రం రీ రిలీజ్ నేపథ్యంలో, చిత్ర బృందానికి తన ఇంట ఘనంగా సన్మానం జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి నిర్మాత అశ్వినీదత్ కు ఓ విలువైన శంఖాన్ని కానుకగా ఇచ్చారు. ఈ శంఖం ఫొటోను అశ్వినీదత్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. 

"ఈ విజయశంఖాన్ని మీరు నాకు కానుకగా ఇచ్చారు. కానీ ఇంద్రుడై, దేవేంద్రుడై ఈ శంఖాన్ని పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం... ఈ జ్ఞాపకం అపురూపం... అదెప్పటికీ నా గుండెల్లో పదిలం... ప్రేమతో మీ అశ్వినీదత్" అంటూ ట్వీట్ చేశారు. 

More Telugu News