Infosys: ఇన్ఫోసిస్ పై అమెరికా కోర్టులో దావా వేసిన కాగ్నిజెంట్

Cognizant sues Infosys

  • తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందన్న కాగ్నిజెంట్
  • టెక్సాన్ ఫెడరల్ కోర్టులో దావా
  • ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్న ఇన్ఫోసిస్

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పై అమెరికాకు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నింజెంట్ కోర్టులో దావా వేసింది. తమ హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్ సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ టెక్సాస్ ఫెడరల్ కోర్టులో కేసు వేసింది. 

తమ ఉద్యోగులను అక్రమంగా చేర్చుకుంటోందని కాగ్నిజెంట్ కు ఇన్ఫోసిస్ గతంలో లేఖ రాసింది. ఇది జరిగిన 8 నెలల తర్వాత ఇన్ఫోసిస్ కు కాగ్నిజెంట్ షాక్ ఇచ్చింది. తమ డేటా బేస్ ల నుంచి చట్ట విరుద్ధంగా ఇన్ఫోసిస్ డేటాను సేకరించిందని... తమకు పోటీగా సాఫ్ట్ వేర్ ను రూపొందించేందుకు దాన్ని ఉపయోగించిందని తన పిటిషన్ లో కాగ్నిజెంట్ పేర్కొంది. మరోవైపు ఇన్ఫోసిస్ ప్రతినిధి ఈ అంశంపై స్పందిస్తూ... కాగ్నిజెంట్ ఆరోపణలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు. 

అమెరికాలోని న్యూజెర్సీ ముఖ్య కేంద్రంగా కాగ్నిజెంట్ పని చేస్తోంది. క్యూఎన్ఎక్స్ టీ, ట్రైజెట్టో ఫేసెస్ సాఫ్ట్ వేర్ లను ఈ సంస్థ అందిస్తోంది. హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు వీటిని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ లను ఆటోమేట్ చేయడానికి వినియోగిస్తున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ ట్రైజెట్టో సాఫ్ట్ వేర్ ను దుర్వినియోగం చేసి టెస్ట్ కేసెస్ ఫర్ ఫేసెట్స్ ను రూపొందించిందని కాగ్నిజెంట్ ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News