Femina Miss India Pageant: ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఇద్దరు తెలుగు యువతులు
![Telugu Young Women Participate in Femina Miss India Pageant](https://imgd.ap7am.com/thumbnail/cr-20240824tn66c94407f3255.jpg)
- ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొననున్న ప్రకృతి కంభం, భవ్యారెడ్డి
- ఫెమినా మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం
- మిస్ ఆంధ్రప్రదేశ్‌గా భవ్యారెడ్డి
- ఇటీవల జరిగిన అర్హత పోటీల్లో సొంత రాష్ట్రాల తరఫున పోటీపడి గెలుపు
త్వరలో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఇద్దరు తెలుగు యువతులు ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ప్రకృతి కంభం, ఆంధ్రకు చెందిన భవ్యారెడ్డి ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ నెల 13న ముంబైలో జరిగిన అర్హత పోటీల్లో ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంభం, మిస్ ఆంధ్రప్రదేశ్ భవ్యారెడ్డి వారి సొంత రాష్ట్రాల తరఫున పోటీపడి గెలుపొందడం జరిగింది. బెంగళూరులో ఉంటున్న ప్రకృతి మోడలింగ్, క్రీడా రంగాల్లో రాణిస్తున్నారు.
అలాగే హైదరాబాద్‌లో ఉంటున్న భవ్యారెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసి, మోడలింగ్‌పై దృష్టిసారించారు. ఇప్పుడు ఈ ఇద్దరు తెలుగు యువతులు ఫెమినా మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీపడనున్నారు.