Kuala Lumpur: కౌలాలంపూర్‌లో కుంగిన ఫుట్‌పాత్‌.. మురుగు కాలువ‌లో ప‌డి తెలుగు మహిళ గ‌ల్లంతు!

Telugu woman from Kuppam Lissing in Kuala Lumpur
  • బాధితురాలు చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన విజ‌య‌ల‌క్ష్మిగా గుర్తింపు
  • భ‌ర్త‌, కుమారుడితో క‌లిసి కౌలాలంపూర్‌లో పూస‌ల వ్యాపారం చేస్తూ జీవ‌నం సాగిస్తున్న మ‌హిళ‌
  • గ‌ల్లంతైన విజ‌య‌ల‌క్ష్మి కోసం మ‌లేసియా అధికారుల గాలింపు చ‌ర్య‌లు
మ‌లేసియా రాజ‌ధాని న‌గ‌రం కౌలాలంపూర్‌లో ప్ర‌మాద‌వశాత్తూ ఫుట్‌పాత్ కుంగి మురుగు కాల్వ‌లో ప‌డ‌డంతో తెలుగు మ‌హిళ గ‌ల్లంత‌య్యారు. బాధితురాలిని చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన విజ‌య‌ల‌క్ష్మిగా గుర్తించారు. కుప్పంలోని అనిమిగామిప‌ల్లెకు చెందిన విజ‌య‌ల‌క్ష్మి త‌న భ‌ర్త‌, కుమారుడితో క‌లిసి కౌలాలంపూర్‌లో పూస‌ల వ్యాపారం చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. 

ఈ క్ర‌మంలో తాజాగా వీరు వెళ్తున్న మార్గంలో ఫుట్‌పాత్ కుంగ‌డంతో విజ‌య‌ల‌క్ష్మి గ‌ల్లంతైంది. అదృష్ట‌వ‌శాత్తూ ఆమె భ‌ర్త‌, కుమారుడు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఈ ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న మ‌లేసియా అధికారులు గ‌ల్లంతైన మ‌హిళ కోసం గాలిస్తున్నారు. విష‌యం స్థానిక ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు తెలియ‌డంతో బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. అలాగే విష‌యాన్ని స్థానిక నేత‌ల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
Kuala Lumpur
Kuppam
Andhra Pradesh
Malaysia

More Telugu News