Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై హత్య కేసు నమోదు

Murder case on Bangla Cricketer Shakib Al Hasan

  • బంగ్లాదేశ్ అల్లర్లలో మృతి చెందిన రూబెల్
  • రూబెల్ తండ్రి ఫిర్యాదుతో 154 మందిపై కేసు నమోదు
  • 28వ నిందితుడిగా షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ కు షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదయింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఈ అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని తండ్రి రఫీకుల్ ఇస్లామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్ అల్ హసన్ 28వ నిందితుడిగా ఉన్నారు. 

ప్రముఖ బంగ్లాదేశీ నటుడు ఫెర్దూస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్, ఫెర్దూస్ అవామీ లీగ్ పార్టీ తరపున ఎంపీలుగా గెలుపొందారు. అయితే, అల్లర్ల కారణంతో షేక్ హసీనా పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం రద్దయింది. దీంతో, వీరిద్దరూ కూడా పదవులు కోల్పోయారు.

Shakib Al Hasan
Bangladesh
Murder case
  • Loading...

More Telugu News