Andhra Pradesh: ఏపీలో మరో 6 పథకాల పేర్లు మార్పు

AP Govt changes 6 schemes names

  • గత ప్రభుత్వ హయాంలోని పేర్లను మారుస్తున్న కూటమి ప్రభుత్వం
  • తాజాగా పాఠశాల విద్యాశాఖకు చెందన 6 పథకాల పేర్లు మార్పు
  • తల్లికి వందనంగా అమ్మఒడి పేరు మార్పు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతోంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను మార్చింది. ఈ పథకాలన్నీ పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న పథకాలే. ఆరు పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

పేర్లు మారిన పథకాలు ఇవే:
  • పాఠశాలల్లో నాడు - నేడు కార్యక్రమం 'మన బడి - మన భవిష్యత్' గా మార్పు
  • అమ్మఒడి పథకం పేరు 'తల్లికి వందనం'గా మార్పు
  • గోరుముద్ద పథకం పేరు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం'గా మార్పు
  • జగనన్న ఆణిముత్యాలు పథకానికి 'అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం'గా నామకరణం
  • స్వేచ్ఛ పథకానికి 'బాలికా రక్ష'గా పేరు మార్పు
  • విద్యాకానుక పథకానికి 'సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర'గా పేరు మార్పు

  • Loading...

More Telugu News