Hardik Pandya: హార్దిక్ పాండ్యా-జాస్మిన్ వాలియా మధ్య రిలేషన్.. చర్చంతా ఏజ్ గ్యాప్ పైనే!

Age Gap between Hardik Pandya and Jasmin Walia

  • నటాషాతో విడాకుల తర్వాత బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో పాండ్యా ప్రేమాయణం
  • పాండ్యా కంటే జాస్మిన్ రెండేళ్ల పెద్ద
  • ప్రపంచ సెలబ్రిటీల్లో చాలామంది ఇంతేనంటున్న అభిమానులు
  • అదేం పెద్ద విషయం కాదని అభిమానుల ఎంకరేజ్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ఇటీవల బాగా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం.. ఘోర పరాజయం.. పేలవ ప్రదర్శన.. ఆపై భార్య నటాషాతో విడాకులు.. తర్వాత మళ్లీ బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమాయణం.. ఇలా తరచూ వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు.

జాస్మిన్‌తో ప్రేమాయణంపై వార్తలు వైరల్ అవుతున్న వేళ వీరికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న ఆత్రుత అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పాండ్యా కంటే జాస్మిన్ రెండేళ్ల పెద్దదన్న విషయం బయటపడింది. పాండ్యా 11 అక్టోబర్ 1993న జన్మించగా, జాస్మిన్ 1991లో జన్మించింది. నిజానికి పాండ్యాతో పరిచయం కంటే ముందే ఆమె బాలీవుడ్ ఫ్యాన్స్‌కు తెలుసు. ‘2018లో వచ్చిన ‘సోను కే టిటు కీ స్వీటీ’ సినిమాలోని ‘బామ్ డిగీ’ పాటతో ఆమె ఇండియాలోనూ పేరు సంపాదించుకుంది. 

పాండ్యా కంటే జాస్మిన్ రెండేళ్లు పెద్దదన్న వార్తలపైనా పలువురు స్పందిస్తున్నారు. అదేం పెద్ద విషయం కాదని, ప్రపంచ సెలబ్రిటీల్లో చాలా జంటల మధ్య ఈ వ్యత్యాసం కనిపిస్తుందని చెబుతున్నారు. వీరిద్దరి గురించి ఇంతగా బయట చర్చలు జరుగుతున్నా అటు పాండ్యా కానీ, ఇటు జాస్మిన్ కానీ బహిరంగంగా ఎక్కడా తమ డేటింగ్‌పై బయటపడలేదు. అయితే, ఫ్యాన్స్ మాత్రం వీరిని చాలా క్లోజ్‌గా గమనిస్తున్నారు. నిజానికి సెలబ్రిటీలు తమ భాగస్వాములను ఎంచుకునే విషయంలో వయసు కంటే కూడా అనుకూలతను చూసుకుంటున్నారన్న విషయం పాండ్యా విషయంలో మరోమారు నిజమైంది.

Hardik Pandya
Natasa Stankovic
Jasmin Walia
Crime News
  • Loading...

More Telugu News