Stock Market: లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

Sensex extends upmove to 3rd day

  • సెన్సెక్స్ 147 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు అప్
  • సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 18 లాభాల్లో ముగింపు
  • వచ్చే నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 81,053 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి 24,811 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్-30 స్టాక్స్‌లో 18 లాభాల్లో ముగియగా, 12 నష్టాల్లో ముగిశాయి. 

భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఐడీబీఐ బ్యాంకు, టైటాన్ టాప్ గెయినర్స్‌గా ఉండగా... మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. డాలర్ మారకంతో రూపాయి 4 పైసలు క్షీణించి రూ.83.94 వద్ద ముగిసింది.

బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ స్టాక్స్ మంచి లాభాల్లో ముగిశాయి. ఆటో, ఫార్మా, ఐటీ, మీడియా రంగాలు మాత్రం నష్టాల్లో ముగిశాయి. మిగతా స్టాక్స్ సానుకూలంగా ముగిశాయి. అదానీ పవర్, అంబుజా సిమెంట్స్‌లో 5 శాతం వాటాను విక్రయించేందుకు అదానీ గ్రూప్ చూస్తోందనే వార్తల నేపథ్యంలో ఈ స్టాక్స్ 3 శాతం మేర క్షీణించాయి.

12 నెలలకు సంబంధించి అమెరికా జాబ్ డేటా సానుకూలంగా నమోదైంది. అంచనాల కంటే అదనపు ఉద్యోగాల సృష్టి జరిగింది. వచ్చే నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఈ జాబ్ డేటాను ఓ సూచనగా భావిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగుస్తున్నాయి.

  • Loading...

More Telugu News