Barrelakka: ఏ తప్పు చేయలేదంటూ భోరున ఏడ్చేసిన‌ బ‌ర్రెల‌క్క‌.. నెట్టింట‌ వీడియో వైర‌ల్‌!

Barrelakka Crying Video goes Viral on Social Media

  • సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్రెల‌క్కపై ఫేక్ న్యూస్ వైర‌ల్‌
  • ఫేస్‌బుక్ ద్వారా ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసింద‌నేది ఆ వార్త సారాంశం
  • బర్రెలక్కపై కథనం ప్రసారం చేసిన కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానెల్‌
  • దీనిపై స్పందిస్తూ క‌న్నీటిప‌ర్యంత‌మైన వైనం

కర్నె శిరీష అంటే గుర్తు ప‌ట్ట‌డం కొంచెం క‌ష్టంగానీ, అదే బర్రెలక్క అంటే అంద‌రూ చాలా ఈజీగా గుర్తు ప‌డ‌తారు. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీగా మారిపోయారామె. ఇక ఇటీవ‌ల‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు చాలా మంది మద్దతిచ్చారు కూడా. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. 

అయితే, తాజాగా ఆమె తాలూకు ఓ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. అందులో బ‌ర్రెల‌క్క క‌న్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేద‌ని, అత‌నెవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం వీడియోలో క‌నిపించింది. 

అస‌లేం జ‌రిగిందంటే..!

కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానెల్‌... బర్రెలక్క తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసింద‌ని వార్తలను ప్రసారం చేసింది. ఆ వార్త‌ల‌లో తన ఫొటోలతో పాటు, పేరు కూడా ప్రస్తావించింది. పైగా బాధితుడు కూడా తనను ఆమె మోసం చేసిందని చెప్పడం గ‌మ‌నార్హం. 

దాంతో ఇప్పుడీ వార్త నెట్టింట బాగా వైర‌ల్‌గా మారింది. చివ‌రికి బర్రెలక్క దృష్టికి కూడా వచ్చింది. దాంతో షాక్ అవ్వ‌డం ఆమె వంతైంది. ఇలా త‌న‌పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వార్త హ‌ల్‌చల్ చేయ‌డంపై ఆమె స్పందించింది. ఇదంతా ఫేక్‌ అని, ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ క‌న్నీటిప‌ర్యంత‌మైంది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియోను బ‌ర్రెల‌క్క పోస్ట్‌ చేసింది.

వీడియోలో బ‌ర్రెల‌క్క ఏం చెప్పిందంటే..!

‘‘ఇప్పుడే ఓ వార్త‌ చూశాను. ఇది ఏ ఛానెలో కూడా నాకు తెలియదు. ఏదో కన్నడ ఛానెల్‌ అని తెలుస్తుంది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌ను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్‌బుక్‌లో చాట్‌ చేసి డబ్బులు దోచుకుందని వార్తలు వేస్తున్నారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావ‌డం లేదు. ఆయ‌నెవ‌రో ముస‌లాయ‌న‌.. అత‌నెవరో కూడా నాకు తెలియదు. కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు. నా పేరు మీద ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా న‌కిలీ ఖాతాలు ఉన్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు’’ అని బోరున ఏడ్చేసిందామె. ఇక ఈ త‌ప్పుడు వార్త‌ల‌ను ప్రచారం చేస్తున్న ఛానెల్‌పై ఆమె అక్క‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు, వారితో మాట్లాడిన ఆడియోను కూడా వినిపించింది.

View this post on Instagram

A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka)

  • Loading...

More Telugu News