Advocate gangadharan srory: మూడు దశాబ్దాలకు కల నెరవేరింది ..ప్లీడర్ గుమాస్తా విజయగాథ

lawyer clerk Gangadharan success story

  • మూడు దశాబ్దాల పాటు ప్లీడర్ గుమాస్తాగా పని చేసిన గంగాధరన్ 
  • 52ఏళ్ల వయసులో ఎల్ఎల్‌బీ పూర్తి చేసి నల్ల కోటు వేసుకుని న్యాయవాది వృత్తి చేపట్టిన వైనం
  • గంగాధరన్ ను పట్టుదలను ప్రశంసిస్తున్న సహచరులు

అతను ఒక సాధారణ ప్లీడర్ గుమాస్తా .. కానీ అతనికి లా కోర్సు పూర్తి చేసి నల్ల కోటు వేసుకుని న్యాయవాదిగా కేసులను వాదించాలని బలమైన కోరిక ఉండేది. అయితే అతని కోరిక నెరవేర్చుకునేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. కలను సాకారం చేసుకోవాలన్న తపనకు పట్టుదల తోడు అవ్వడంతో అతను తాను అనుకున్నది సాధించాడు. ఇది న్యాయవాదిగా మారిన ఓ ప్లీడర్ గుమాస్తా విజయ గాథ. 

విషయంలోకి వెళితే.. కేరళ రాష్ట్రం కోసర్‌గోడ్ లోని కోజువల్ పల్లియానికి చెందిన గంగాధరన్ 1992లో కోర్టులో ప్లీడర్ గుమాస్తాగా చేరాడు. అప్పటి నుండి పలువురు న్యాయవాదుల వద్ద గుమాస్తాగా పని చేస్తూ వచ్చాడు. అప్పటి నుండే న్యాయవాది కావాలని గంగాధరన్ అనుకున్నాడు. కానీ పలు పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయాడు. దీంతో అతని కోరిక అలానే ఉండిపోయింది. అయితే 2019లో కాన్నూర్ యూనివర్శిటీ నుండి మలయాళంలో బీఏ పూర్తి చేసిన గంగాధరన్ .. ఆ తర్వాత సుల్కాలోని కేవిజీ లా కళాశాలలో ఎల్ఎల్ బీ చేరాడు. 
 
ఆ సమయంలోనూ ఓ న్యాయవాది వద్ద గుమాస్తాగా గంగాధరన్ పని చేస్తూనే ఎల్ఎల్‌బీ పూర్తి చేశాడు. ఇటీవలే కోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. 52 ఏళ్ల వయసులో నల్ల కోటు ధరించి తను గుమాస్తాగా పనిచేసిన న్యాయస్థానంలోనే న్యాయవాదిగా గంగాధరన్ ప్రాక్టీసు చేస్తున్నాడు. గంగాధరన్ పట్టుదలతో ప్లీడర్ గుమాస్తా నుండి ప్లీడర్ గా ఎదిగిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. చదువుకు వయసుతో పని లేదని కల నెరవేర్చుకోవాలన్న పట్టుదల, కృషి ఉంటే సరిపోతుందని గంగాధరన్ నిరూపించాడు.  

  • Loading...

More Telugu News