Jogi Ramesh: జోగి రమేశ్ విచారణకు సహకరించడం లేదు... గుర్తుకు లేదు, తెలియదని చెబుతున్నారు: మంగళగిరి డీఎస్పీ

Mangalagiri DSP says Jogi Ramesh is not supporting

  • అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని వెల్లడి
  • 94 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి నుంచైనా సమాచారం రాబట్టుకోవచ్చన్న డీఎస్పీ
  • కేసు విచారణ మధ్యలో ఉంది... మరింత విచారణ చేయాల్సి ఉందని వెల్లడి

వైసీపీ నేత జోగి రమేశ్ విచారణకు సహకరించడం లేదని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఏం అడిగినా... తెలియదు, గుర్తుకు లేదని చెబుతున్నారన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఈరోజు వైసీపీ నేతను విచారించిన అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... ఈరోజు విచారణ నిమిత్తం 94 బీఎన్ఎస్ఎస్ కింద విచారణకు పిలిచినట్లు తెలిపారు. దాడి కేసుకు సంబంధించి ప్రశ్నించగా ఆయన సమాచారం ఇవ్వలేదన్నారు.

అవసరమైతే జోగి రమేశ్‌ను మళ్లీ విచారణకు పిలుస్తామని తెలిపారు. 94 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం విచారణలో భాగంగా ఏ వ్యక్తిని అయినా కావాల్సిన డాక్యుమెంట్లను గానీ, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను గానీ అడిగే అధికారం ఉందన్నారు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తినుంచైనా కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకునే అధికారం పోలీసులకు ఉందన్నారు. కేసు విచారణ మధ్యలో ఉందని, మరింత విచారణ చేయాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News