Pawan Kalyan: గ్రామసభల్లో ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan talks about Grama Sabha

 


ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలపై ఆయన స్పందిస్తూ... ఈ నెల 23న రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

గ్రామసభ గురించి ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలపాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలో 100 రోజులు ఉపాధి పనుల కల్పనపై అవగాహన పెంచాలని సూచించారు. 2024-25లో చేపట్టే ఉపాధి పనులపై గ్రామసభ ఆమోదం ఉండాలని పేర్కొన్నారు. 

గ్రామసభల్లో ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భాగస్వాములు కావాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News