Bangladesh Violence: బంగ్లాదేశ్ ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి నివేదిక... 650 మంది చనిపోయినట్టు వెల్లడి

UN releases report on Bangladesh violence

  • బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం హింసాత్మకం
  • ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా
  • తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ యూనస్
  • 'బంగ్లాదేశ్ లో నిరసనలు-హింసపై ప్రాథమిక విశ్లేషణ' పేరిట ఐరాస నివేదిక

ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలంటూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపుదాల్చడం, ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన భారత్ లో తలదాచుకోవడం, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక పాలకుడిగా పగ్గాలు అందుకోవడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ లో చోటుచేసుకున్న ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి నివేదిక రూపొందించింది. 'బంగ్లాదేశ్ లో నిరసనలు-హింసపై ప్రాథమిక విశ్లేషణ' పేరిట ఈ నివేదికను రూపొందించింది. బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మరణించినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.  

ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన ఘటనల్లోనే 250 మంది వరకు మరణించారని తెలపింది. మృతుల్లో భద్రతా సిబ్బంది, పాత్రికేయులు కూడా ఉన్నారని ఐక్యరాజ్యసమితి వివరించింది.

More Telugu News