Ambati Rambabu: చంద్రబాబు నిర్ణయాలు పోలవరంకు ప్రతికూలంగా మారాయి: అంబటి రాంబాబు

Ambati Rambabu said Chandrababu caused to delay Polavaram

  • చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్న అంబటి
  • కానీ వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
  • ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని సవాల్

పోలవరం అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం అయిందని ఆరోపించారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు చేసిన తప్పిదమేనని అన్నారు. చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం పోలవరం పాలిట ప్రతికూలంగా మారిందని విమర్శించారు. 

వైసీపీ హయాంలో పోలవరం పనులను పరుగులు తీయించామని చెప్పుకొచ్చారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో పనులు ముందుకు జరగలేదని అంబటి రాంబాబు తెలిపారు. 

నాడు వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, ఆయన మరణం తర్వాత పోలవరం బాధ్యతను కేంద్రం స్వీకరించిందని, అయితే ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటాం అని చంద్రబాబు చెప్పారని వివరించారు. 

చంద్రబాబు వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే, అందుకు వైసీపీనే కారణమని తిరిగి మాపైనే ఆరోపణలు చేశారు అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News