GV Anjaneyulu: జగన్, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాపాలు అన్నీఇన్నీ కావు: జీవీ ఆంజనేయులు

GV Anjaneyulu fires on Jagan

  • డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలతో విషం తాగించారని మండిపాటు
  • నాసిరకం మద్యంతో 30 వేల మందికి పైగా ప్రాణాలు తీశారని ఆరోపణ
  • జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్య

వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలపై వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు గుప్పించారు. వీరు చేసిన పాపాలు అన్నీఇన్నీ కావని ఆయన అన్నారు. డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలతో విషం తాగించారని మండిపడ్డారు. కల్తీ, నాసిరకం మద్యంతో ఏపీలో 30 వేల మందికి పైగా ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ. 1.24 లక్షల కోట్ల మద్యాన్ని నగదు రూపంలో అమ్మారని విమర్శించారు. నాసిరకం మద్యం అక్రమాలకు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. కూటమి ప్రభుత్వం మద్యం విధానాన్ని సంస్కరించాలని చూస్తుంటే... వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

GV Anjaneyulu
Telugudesam
Jagan
Vijayasai Reddy
Mithun Reddy
YSRCP
  • Loading...

More Telugu News