Road Accident: అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు భార‌త సంతతి వ్యక్తుల దుర్మ‌ర‌ణం!

Road Accident in America Three Indians Died

  • అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘ‌ట‌న‌
  • టెక్సాస్ విశ్వ‌విద్యాల‌యానికి వెళ్తున్న స‌మ‌యంలో వారు ప్ర‌యాణిస్తున్న కారు టైరు పేల‌డ‌మే ప్ర‌మాదానికి కార‌ణం
  • అర‌వింద్ మ‌ణి, భార్య ప్ర‌దీప అర‌వింద్‌, కుమారుడు ఆండ్రిల్ అర‌వింద్ స్పాట్ డెడ్‌

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్ర‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భార‌త సంత‌తి వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వారు టెక్సాస్ విశ్వ‌విద్యాల‌యానికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది.

మృతుల‌ను అర‌వింద్ మ‌ణి, అత‌ని భార్య ప్ర‌దీపా అర‌వింద్‌, వారి కుమారుడు ఆండ్రిల్ అర‌వింద్‌గా గుర్తించారు. ఈ ఫ్యామిలీ ప్ర‌యాణిస్తున్న కారు టైరు ఒక్క‌సారిగా పేల‌డమే ఈ ప్ర‌మాదానికి కార‌ణం అని భావిస్తున్నారు. దాంతో వారు ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పి మ‌రో కారును బ‌లంగా ఢీకొట్టింది. 

దీంతో కారులోని ఆ ముగ్గురు స్పాట్‌లోనే చ‌నిపోయారు. డ‌ల్లాస్‌లోని టెక్సాస్ యూనివ‌ర్సిటీలో కొడుకును వ‌దిలిపెట్టేందుకు కారులో వెళ్ల‌డం, ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఇలా ముగ్గురూ మృతి చెందారు. కాగా, అర‌వింద్ మ‌ణి, ప్ర‌దీప దంప‌తుల‌కు మ‌రో కుమారుడు ఆదిర్యాన్ ఉన్నాడు. కుటుంబంలో ముగ్గురు చ‌నిపోవ‌డంతో అత‌డు ఒంట‌రిగా మిగిలిపోవ‌డం అంద‌రినీ క‌లిచివేస్తోంది. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు చ‌నిపోవ‌డం ప‌ట్ల అక్క‌డి ప్ర‌వాస భార‌తీయులు కూడా విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News