Chiranjeevi: రిషబ్ శెట్టి సహా అవార్డులకు ఎంపికైన వారికి చిరంజీవి శుభాకాంక్షలు

Chiranjeevi Congratulates national award winners

  • ఉత్తమ నటిగా ఎంపికైన నిత్యామీనన్‌కు అభినందనలు తెలిపిన చిరంజీవి
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన కార్తికేయ 2 బృందానికి అభినందనలు
  • 70వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించిన కేంద్రం

70వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన వారికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నటి నిత్యా మీనన్, మరో ఉత్తమ నటి మాన్సీపరేఖ్, ఉత్తమ చిత్రం ఆట్టమ్ సినిమా బృందానికి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన కార్తికేయ 2 సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులకు ఎంపికైన సినిమాలకు, బృందానికి, వ్యక్తులకు అభినందనలు తెలిపారు. అందరికీ మరింత శక్తి రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News