Telangana: అమెరికాలో గుండెపోటుతో తెలంగాణ యువకుడి మృతి

Telangana student dies in America

  • హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రాజేశ్ మృతి
  • ఉన్నత చదవుల కోసం కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లిన రాజేశ్
  • చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేస్తున్న రాజేశ్

అమెరికాలో గుండెపోటుతో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్ ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, రాజేశ్ గుండెపోటుతో మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు అమెరికా నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రాజేశ్ మృతితో కుటుంబం కన్నీరుమున్నీరైంది.

రాజేశ్ మృతదేహం కోసం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎదురు చూస్తున్నారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా తీసుకు రావాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజేశ్ తండ్రి ఆర్థిక సమస్యలతో కొన్నేళ్ళ క్రితం మరణించాడు. ఇప్పుడు రాజేశ్ కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Telangana
USA
Death
  • Loading...

More Telugu News