Narendra Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది: మోదీ

Got a call from Bagladesh temporary PM Muhammad Younus says Modi

  • బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిణామాలపై ఇద్దరం మాట్లాడుకున్నామన్న మోదీ
  • హిందువులకు భద్రత కల్పిస్తామని యూనస్ హామీ ఇచ్చారని వెల్లడి
  • శాంతియుత ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందన్న ప్రధాని

బంగ్లాదేశ్ లోని మైనార్టీలపై హింసాత్మక దాడులు కొనసాగుతుండటంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ఫోన్ కాల్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. 

బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిణామాలపై ఇద్దరం మాట్లాడుకున్నామని మోదీ వెల్లడించారు. ఆ దేశంలోని హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పిస్తామని మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారని తెలిపారు. శాంతియుత, సుస్థిర, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని చెప్పారు. 

మరోవైపు నిన్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుక సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అక్కడ ఉన్న హిందువులు, మైనార్టీల భద్రతను భారత్ కోరుకుంటోందని తెలిపారు. 

యూనస్ కూడా ఇటీవల స్పందిస్తూ... మానవులంతా ఒక్కటేనని, హక్కులు అందరికీ సమానమేనని చెప్పారు. మతం ఏదైనా, ప్రజాస్వామ్యంలో మనుషులంతా ఒక్కటేనని అన్నారు. సంస్థాగత లోపాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News