National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన... ఉత్తమ నటుడు 'కాంతార' రిషబ్ శెట్టి

70th national film awards

  • ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆట్టమ్
  • ఉత్తమ నటిగా నిత్యామీనన్
  • ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2

కేంద్ర ప్రభుత్వం నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. కన్నడ సూపర్ డూపర్ హిట్ మూవీ "కాంతార"కు అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో నటనకు గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. మలయాళ చిత్రం "అట్టం" జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 

70వ జాతీయ చలన చిత్ర అవార్డులు...

ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ నటుడు: రిషప్ శెట్టి (కాంతార, కన్నడ సినిమా)
ఉత్తమ నటి - నిత్యామీనన్, మానసి పరేఖ్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - కార్తికేయ-2 (తెలుగు)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - కేజీయఫ్-2 (కన్నడ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - పొన్నియన్ సెల్వన్-1 (తమిళం)
ఉత్తమ దర్శకుడు - సూరజ్ బర్జాత్యా
బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్, ఎన్విరాన్‌మెంటల్ వ్యాల్యూస్ - కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ)
ప్రేక్షకాదరణ పరంగా ఉత్తమ వినోద్మాక చిత్రం- కాంతార (కన్నడ)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - బ్రహ్మాస్త్ర-1:శివ (హిందీ)
ఉత్తమ డెబ్యూ దర్శకుడు - ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ సహాయ నటి - నీనా గుప్తా
ఉత్తమ సహాయ నటుడు - పవన్ రాజా మల్హొత్రా
ఉత్తమ సినిమాటోగ్రఫీ - పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 (తమిళం), సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్
ఉత్తమ ఫిమేల్ బ్లే బ్యాక్ సింగర్ - బాంబే జయశ్రీ, 
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - శ్రీపాథ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - నిక్కి జోషి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - ఆనంద్ ఆద్య
ఉత్తమ ఎడిటింగ్ - ఆట్టమ్ (ఎడిటర్ మహేశ్ భువనేండ్)
ఉత్తమ సౌండ్ డిజైన్ - పొన్నియన్ సెల్వన్-1 (డిజైనర్ ఆనంద్ కృష్ణమూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే - ఆట్టం (ఆనంద్ ఏకర్షి)
ఉత్తమ మాటల రచయిత - అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ - అన్బరివు (కేజీఎఫ్2)
ఉత్తమ కొరియోగ్రఫీ - జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ మాస్టర్
ఉత్తమ లిరిక్స్ - ఫౌజా (హరియాన్వీ),
ఉత్తమ సంగీతం - బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ (ప్రీతమ్)
ఉత్తమ నేపథ్య సంగీతం - పొన్నియన్ సెల్వన్-1 (ఏఆర్ రెహ్మాన్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - ఒడియా - దమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - మలయాళం - సౌదీ వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - మరాఠీ - వాల్వీ (ది టైర్మైట్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - హిందీ - గుల్ మొహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - బెంగాళీ - కబేరీ అంతర్థాన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - పంజాబీ - బాగీ డి దీ
బెస్ట్ టివా ఫిల్మ్ - సికాసిల్

  • Loading...

More Telugu News