Chandrababu: టాటా గ్రూప్ ఛైర్మన్, సీఐఐ బృందంతో చంద్రబాబు కీలక చర్చలు

TATA group chairmen to meet Chandrababu

  • పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై చంద్రబాబు ఫోకస్
  • ఉదయం 10.30 గంటలకు బాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ
  • నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో చర్చించనున్న సీఎం

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈరోజు చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు వీరి సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రితో సీఐఐ ప్రతినిధుల బృందం సమావేశమవుతుంది. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని బృందం చంద్రబాబును కలుస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చిస్తారు.

  • Loading...

More Telugu News