Seethakka: మహిళలపై కేటీఆర్ 'బ్రేక్ డ్యాన్స్' కామెంట్... నిప్పులు చెరిగిన సీతక్క

Seethakka fires at BRS working president KTR

  • బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు వేసుకోవచ్చునని కేటీఆర్ మాట్లాడటాన్ని తప్పుబట్టిన సీతక్క
  • పదేళ్లలో హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డ్యాన్స్‌లను ఎంకరేజ్ చేశారని ఆరోపణ
  • ఇతరులకు ఇబ్బంది కలగకుండా బ్రేక్ డ్యాన్సులు వేస్తే తప్పేమిటని ప్రశ్న

మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చునంటూ మహిళల పట్ల కేటీఆర్ అవమానకరంగా మాట్లాడారన్నారు. ఆయనకు ఆడవాళ్లంటే గౌరవం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చే ఉచిత పథకాల కోసం కక్కుర్తిపడి బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారన్నట్లుగా మాట్లాడటం శోచనీయమన్నారు.

గత పదేళ్లలో హైదరాబాద్ నగరంలో క్లబ్‌లు, పబ్బులు, బ్రేక్ డ్యాన్సులను ఎంకరేజ్ చేసిన చరిత్ర మీదని విమర్శించారు. కానీ తాము మాత్రం మహిళలకు అన్ని రకాలుగా ప్రయోజనం కలిగించాలని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. బస్సులో ఏదో సీటు ఖాళీగా ఉంటే... ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రేక్ డ్యాన్సులు వేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. 

కేటీఆర్‌కు, బీఆర్ఎస్ నాయకులకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే నచ్చడం లేదన్నారు. పేదలకు తమ ప్రభుత్వం ఇచ్చే పథకాలను వారు జీర్ణించుకోవడం లేదన్నారు. బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసుకోండంటూ కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

  • Loading...

More Telugu News