CM Chandrababu: సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidu Speech at Independence Day

  • విజ‌య‌వాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ‌జెండాను ఎగుర‌వేసిన చంద్ర‌బాబు
  • గ‌త ఐదేళ్ల‌లో దెబ్బ‌తిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామ‌న్న బాబు
  • ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందని వ్యాఖ్య‌
  • 120కి పైగా సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచామ‌న్న చంద్ర‌బాబు

స్వాతంత్ర్యం దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో జాతీయ‌జెండాను ఆవిష్క‌రించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ‌త ఐదేళ్ల‌లో దెబ్బ‌తిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామ‌ని తెలిపారు. ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందన్న చంద్ర‌బాబు.. ఐదేళ్లుగా ప్ర‌జ‌లు కోల్పోయిన స్వేచ్ఛ‌ను అందించేందుకు క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నారు. 

సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం నిర్వీర్యం చేసిన శాఖ‌ల్ని పున‌రుద్ధ‌రించే ల‌క్ష్యంతో 100 రోజుల ప్ర‌ణాళిక‌తో అన్ని శాఖ‌ల్లో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. విభ‌జ‌న‌తో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌కు రాజ‌ధాని కూడా లేని ప‌రిస్థితిలో నాడు పాల‌న ప్రారంభించిన‌ట్లు గుర్తు చేశారు. 

అటువంటి ప‌రిస్థితి నుంచి ప్ర‌భుత్వాన్ని ప‌ట్టాలెక్కింమ‌న్నారు. ప్ర‌జ‌ల స‌హ‌కారం, త‌మ‌కు ఉన్న అనుభ‌వంతో నిల‌దొక్కున్న‌ట్లు తెలిపారు. 120కి పైగా సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచామ‌ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్ర‌థ‌మంగా నిలిచామ‌న్నారు. రూ. 16 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులకు వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News