Upasana Kamineni Konidela: మ‌నం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జ‌రుపుకుంటున్నాం?: ఉపాసన కొణిదెల

Upasana Konidela Tweet on Kolkata doctor rape murder case

  • ఎక్స్ వేదిక‌గా కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌పై ఉపాస‌న ఆవేద‌న‌ 
  • ఇది మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న అని కామెంట్  
  • స‌మాజంలో అనాగ‌రిక‌త కొన‌సాగుతోందన్న ఉపాసన 
  • దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు మ‌హిళ‌లే వెన్నెముక అని వ్యాఖ్య‌

కోల్‌క‌తా జూనియ‌ర్ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌పై కొణిదెల వారి కోడ‌లు ఉపాస‌న కామినేని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. కొంద‌రిలో క‌నీస మాన‌వ‌త్వం ఉండ‌డం లేద‌ని విచారం వ్య‌క్తం చేశారు. మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న ఇది అని పేర్కొన్నారు. స‌మాజంలో అనాగ‌రిక‌త కొన‌సాగుతుంటే మ‌నం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామ‌ని ఆమె ప్ర‌శ్నించారు.  

దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు మ‌హిళ‌లే వెన్నెముక అని తెలిపిన ఉపాస‌న‌.. ఈ రంగంలోని వ‌ర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మ‌హిళ‌లే ఉన్నార‌ని చెప్పారు. అంతేగాక ప‌లు అధ్యయ‌నాలు మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్లే రోగుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు తేల్చాయ‌ని గుర్తు చేశారు. మ‌హిళ‌లు మ‌న హెల్త్ రంగానికి చాలా అవ‌స‌రమ‌ని పేర్కొన్నారు.

అందుకే ఎక్కుమంది మ‌హిళ‌ల‌ను వ‌ర్క్‌ఫోర్స్ లోకి, అందులోనూ హెల్త్‌కేర్ విభాగంలోకి తీసుకురావ‌డం త‌న లక్ష్యం అన్నారు. ఈ విభాగంలో వారి అవ‌స‌రం చాలా ఉంద‌న్నారు. కోల్‌క‌తా ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌తి మ‌హిళ‌కు భ‌ద్ర‌త‌, గౌర‌వం కోసం అంద‌రం క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తే త‌ప్ప‌కుండా మార్పు వ‌స్తుంద‌ని ఉపాస‌న చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News