Thieves: ఆ సినిమా చూసి దొంగలుగా మారిన దంపతులు

A couple who became thieves after watching that movie

  • ఉత్తర ఢిల్లీలోని ఓ ఇంటిలో మొబైల్ ఫోన్ చోరీ చేసిన దంపతులు 
  • చోరీ చేస్తూ స్థానికులకు చిక్కడంతో పోలీసులకు అప్పగింత
  • 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలోని పాత్రల స్పూర్తితో   దొంగలుగా మారామని విచారణలో వెల్లడి 

గతంలో సమాజంలో జరుగుతున్న ఇతి వృత్తాల ఆధారంగా సినిమాలు రూపొందిస్తుండేవారు. పలు సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి. చైతన్య స్పూర్తిని రగిలించే చిత్రాలు తీస్తుండేవారు. సినిమాల్లో హీరో (కధానాయకుడు) కష్టపడి పైకి వచ్చిన తీరును ఆ హీరో అభిమానులు స్పూర్తిగా తీసుకునేవారు. అయితే ఇప్పుడు కొందరు సినిమాల్లో ఉన్న మంచిని స్పూర్తిగా తీసుకోకుండా, సినిమాలో పాత్రధారులు చేసిన నేరాలను ఆదర్శంగా తీసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడిన దంపతులు చెప్పిన విషయం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.
 
ఉత్తర ఢిల్లీలోని ఓ ఇంటిలో మొబైల్ ఫోన్ చోరీ చేసిన కేసులో గౌరవ్ (30), వందన (30) దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు విచారించగా, ఆశ్చర్యపోయే అంశం వెలుగులోకి వచ్చింది. అది ఏమిటంటే.. వీరు ఇద్దరూ బాలీవుడ్ సినిమా బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని పాత్రలను స్పూర్తిగా తీసుకుని అనేక చోరీలకు పాల్పడ్డారట. ఈ విషయాన్ని డీసీపీ మనోజ్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు.
 
నార్త్ ఢిల్లీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా ఆగస్టు 12న తమకు సమాచారం వచ్చిందని డీసీపీ తెలిపారు. నేరానికి పాల్పడిన ఈ దంపతులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిని పోలీసులు విచారించగా, పలు దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించారన్నారు. బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని పాత్రలను చూసి తాము ఇన్ స్పైర్ అయినట్లు తెలిపారన్నారు. వేకువజామున తెరిచి ఉన్న ఇళ్లు, మార్నింగ్ వాక్ కు లేదా ఆలయాలకు వెళ్లే వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తాము చోరీలకు పాల్పడినట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ దంపతులను పోలీసులు సిటీ కోర్టులో హజరుపర్చగా, మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులు ఇవ్వడంతో జైలుకు తరలించారు.  
 
ఇక 'బంటీ ఔర్ బబ్లీ' చిత్రం విషయానికి వస్తే, 2005లో విడుదలైన భారతీయ హిందీ భాష క్రైమ్ కామెడీ చిత్రం. షాద్ అలీ దీనికి దర్శకత్వం వహించగా, చిత్రంలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు చేసిన రెండవ భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.

  • Loading...

More Telugu News