Duleep Trophy: దులీప్ ట్రోఫీకి జట్లను ప్రకటించిన బీసీసీఐ... బరిలో టీమిండియా ఆటగాళ్లు

BCCI announces four teams for Duleep Trophy

  • సెప్టెంబరు 5 నుంచి దులీప్ ట్రోఫీ
  • నాలుగు జట్లను ప్రకటించిన బీసీసీఐ
  • రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి

సెప్టెంబరు 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం బీసీసీఐ నేడు జట్లను ప్రకటించింది. ఏ, బీ, సీ, డీ పేరిట నాలుగు జట్లను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా టీమిండియా ఆటగాళ్లను దులీప్ ట్రోఫీలో వివిధ జట్లకు ఎంపికచేశారు. 

ఇక, తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి బీ-టీమ్ లో ఆడుతున్నాడు. అయితే, ఈ టోర్నీకి ముందుగా అతడు తన ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఫిట్ నెస్ నిరూపించుకుంటునే తుది జట్టులో స్థానం లభిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్ తో నితీశ్ కుమార్ రెడ్డి భారత క్రికెట్ వర్గాల్లో క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. దులీప్ ట్రోఫీలో రాణిస్తే నితీశ్ కు టీమిండియాలో స్థానం దక్కే అవకాశాలున్నాయి. 

ఇక, హైదరాబాద్ స్టార్ ఆటగాడు తిలక్ వర్మకు ఏ-టీమ్ లో స్థానం దక్కింది. ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్ డీ-టీమ్ కు ఎంపికయ్యాడు.

జట్ల వివరాలు...

టీమ్-ఏ: శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియాన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శాశ్వత్ రావత్.

టీమ్-బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, ముఖేశ్ కుమార్, రాహుల్ చహర్, సాయి కిశోర్, మోహిత్ అవస్థి, జగదీశన్.

టీమ్-సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, బి.ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్ కుమార్, అన్షుల్ కాంభోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్, సందీప్ వారియర్.

టీమ్-డి: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సారాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆదిత్య తకారే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్ పాండే, ఆకాశ్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.

  • Loading...

More Telugu News