IPS: సంతకం చేశాకే ఇంటికి వెళ్లాలి... ఏపీలో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు డీజీపీ మెమోలు

DGP issues memos to IPS officers on waiting

  • కూటమి సర్కారు వచ్చాక భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థానచలనం
  • పలువురు వివాదాస్పద ఐపీఎస్ లను డీజీపీ ఆఫీసుకు అటాచ్ 
  • వీరిలో కొందరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అందుబాటులో లేని వైనం
  • ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు హెడ్ క్వార్టర్స్ లో ఉండాలంటూ మెమోలు

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీలు తప్పలేదు. చాలామంది ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. 

తాజాగా, వెయిటింగ్ లో ఉండి, హెడ్ క్వార్టర్స్ కు అందుబాటులో లేని కొందరు ఐపీఎస్ అధికారులకు డీజీపీ మెమోలు జారీ చేశారు. ప్రతి రోజూ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు. 

మెమోలు అందుకున్న వారిలో పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కొల్లి రఘురామిరెడ్డి, సంజయ్, కాంతి రాణా టాటా, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు, విశాల్ గున్ని, విజయరావు, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, అమ్మిరెడ్డి ఉన్నారు. 

వీరంతా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. 

ఆకే రవికృష్ణకు పోస్టింగ్

కేంద్ర డిప్యుటేషన్ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణకు పోస్టింగ్ ఇచ్చారు. ఆకే రవికృష్ణను పోలీస్ ఆర్గనైజేషన్ ఐజీగా నియమించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ బాధ్యతలు కూడా అప్పగించారు. 

  • Loading...

More Telugu News