IMD: ఏపీ, తెలంగాణ సహా ఆ రాష్ట్రాలకు వర్ష సూచన

IMD Rain Alert Warning for those states including AP Telangana

  • రానున్న 24 గంటల్లో 17 రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
  • ఢిల్లీలో ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు
  • ఆగస్టు 18వరకూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో ఈ నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు వర్ష సూచనలు చేసింది. ఢిల్లీ పరసరాల్లో నిన్న జోరుగా వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆలానే రానున్న 24 గంటల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాఖండ్, గుజరాజ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
  
రేపు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆగస్టు 15న కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ము, హర్యానా, చత్తీస్ గఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 18వరకూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు 16వరకూ హర్యనాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News