DSC Prelims: తెలంగాణ డీఎస్సీ ప్రిలిమ్స్ కీ విడుదల... అభ్యంతరాలకు ఈ నెల 20 వరకు అవకాశం

Telangana DSC Prelims Key released

  • తెలంగాణలో జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ ప్రిలిమ్స్
  • 2,45,263 మంది పరీక్షలకు హాజరు
  • కీ, రెస్పాన్స్ షీట్లను వెబ్ సైట్ లో ఉంచిన అధికారులు 

తెలంగాణలో ఇటీవల 11,062 టీచర్ పోస్టులకు డీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,45,263 మంది డీఎస్సీ ప్రిలిమ్స్ కు హాజరయ్యారు. 

తాజాగా, ఈ పరీక్షలకు సంబంధించి కీ విడుదల చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజి పండిట్, పీఈటీ పోస్టులకు వేర్వేరుగా కీ, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. కాగా, డీఎస్సీ అభ్యర్థులు 'కీ'పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఆగస్టు 20 వరకు అవకాశం కల్పించారు.

  • Loading...

More Telugu News