Ramcharan: 'మోడ్రన్‌ మాస్టర్స్‌'.. రాజమౌళికి మనమిచ్చే సరైన గౌరవం: రామ్​ చరణ్

Global Star Ramcharan Praises Modern Masters

  • రాజమౌళి సినీ, పర్సనల్ జర్నీ ఆధారంగా 'మోడ్రన్‌ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి'
  • ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఆగ‌స్టు 2న విడుద‌ల‌
  • డాక్యుమెంట‌రీని డైరెక్ట్ చేసిన రాఘవ్‌ ఖన్నా
  • తాజాగా దీనిపై రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శంస‌లు

ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి సినీ, పర్సనల్ జర్నీ ఆధారంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన డాక్యుమెంటరీ మోడ్రన్‌ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి. ఈ డాక్యుమెంటరీని రాఘవ్‌ ఖన్నా డైరెక్ట్ చేశారు. ఇది ఆగస్టు 2న విడుద‌లైంది. ఇందులో రాజమౌళి ఒక సీరియల్ దర్శకుడు నుంచి ఎలా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ దర్శకునిగా రూపాంతరం చెందారు? అనేది చూపించారు. 

అలాగే తనకి, తన కుటుంబానికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎలాంటిది? తన హీరోస్ తో సినిమాలు చేసినప్పుడు వారు పడే బాధలు ఏంటి? రాజమౌళిని ఎందుకు పని రాక్షసుడు అంటారు? సినిమాల నుంచి బ్రేక్ సమయాల్లో రాజమౌళి ఏం చేస్తాడు? త‌దిత‌ర అంశాల‌ను ఇందులో ప్ర‌స్తావించారు. 

ఇక ఈ డాక్యుమెంటరీ ఇప్ప‌టికే ప‌లువురి ప్రశంసలు అందుకుంది. దీనిపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. తాజాగా గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఈ డాక్యుమెంటరీని పొగడుతూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

"రాజమౌళికి సినిమాలపై, స్టోరీలపై ఉన్న డెడికేషన్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఈ 'మోడ్రన్‌ మాస్టర్స్‌' డాక్యుమెంటరీ ఆయన ఉజ్వల కెరీర్‌కు మనమిచ్చే సరైన గౌరవం అని నేను భావిస్తున్నాను" అంటూ చెర్రీ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan)

  • Loading...

More Telugu News