Rains: తెలంగాణలో మరికొన్ని రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Rains for another three days in telangana

  • నేటి నుంచి రేపటి వరకు పలుచోట్ల 40 కిలో మీటర్ల వేగంతో గాలులు
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
  • ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. శుక్రవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 

గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News