25 Lakh PA: ఏడాదికి రూ.25 లక్షల వేతనం మరీ తక్కువంటున్న ఇన్వెస్టర్

Investor Says Rs 25 Lakh Salary Too Little To Run Family

  • ఆ మొత్తంతో కుటుంబాన్ని నడపలేం.. ఇక పొదుపు ఎలా చేస్తామని సౌరవ్ దుత్తా ప్రశ్న
  • దుత్తా ట్వీట్ పై సోషల్ మీడియాలో డిబేట్
  • ఫన్నీగా కామెంట్లు పెడుతున్న నెటిజన్లు

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చుక్కలనంటుతున్న ఖర్చులతో వేతన జీవులకు కుటుంబాన్ని నడపడం కష్టమేనని ప్రముఖ ఇన్వెస్టర్ సౌరవ్ దుత్తా పేర్కొన్నారు. ఏడాదికి రూ.25 లక్షలతో ముగ్గురు సభ్యులున్న కుటుంబాన్ని నడపలేమంటున్నారు. ఇంట్లో సరుకులు, ఈఎంఐలు, రెంట్, రెస్టారెంట్ ఖర్చులు, సినిమాలు, ఓటీటీలకు చందాలు, వైద్యం.. తదితర ఖర్చులు లెక్కేస్తే ఈ జీతం బొటాబొటీగా సరిపోతుందని అన్నారు. ఏడాదికి రూ.25 లక్షల వేతనం అంటే కటింగ్స్ పోను నెలకు చేతికి వచ్చేది సుమారు రూ.1.5 లక్షలు.. అయితే, ఈ మొత్తం ఇంటి ఖర్చులకే సరిపోదని ఇక పొదుపు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ఇదీ దత్తా లెక్క..
ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. నెలవారీగా ఈ కుటుంబం కనీస అవసరాలు ప్లస్ ఇంటి అద్దె లేదా ఈఎంఐలకు రూ.1 లక్ష వెచ్చించాల్సి వస్తుందని, వారానికో రెండు వారాలకో బయట తినడానికి, సినిమాలు, ఓటీటీ, డే ట్రిప్స్ కు రూ.25 వేలు, ఎమర్జెన్సీ అవసరాలు, వైద్యం కోసం రూ.25 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని సౌరవ్ దత్తా చెప్పుకొచ్చారు. నెలనెలా ఫస్ట్ కు వచ్చిన జీతం ఇలా ఖర్చులకే సరిపోతే పొదుపు మాటేమిటని ప్రశ్నిస్తూ దత్తా ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో చర్చ..
సౌరవ్ దత్తా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. చాలామంది నెటిజన్లు ఈ ట్వీట్ పై ఫన్నీగా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయంలను దృష్టిలో పెట్టుకుని చూస్తే దత్తా అభిప్రాయం కరెక్టేనని వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News