Vamsi: ఆ సినిమాకి రాజేంద్రప్రసాద్ ను వద్దనే అన్నారు: డైరెక్టర్ వంశీ

Vamsi Interview

  • 1985లో విడుదలైన 'ప్రేమించు పెళ్లాడు'
  • రాజేంద్రప్రసాద్ సరసన నటించిన భానుప్రియ
  • ఉషా కిరణ్ నుంచి వచ్చిన సినిమా 
  • భానుప్రియ అక్కడ పుట్టిందట  


వంశీకి మంచిపేరు తెచ్చిపెట్టిన సినిమాలలో 'ప్రేమించు పెళ్లాడు' ఒకటి. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, 1985లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాలతో పాటు, పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందువలన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజా ఇంటర్వ్యూలో వంశీ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. 

'ప్రేమించు పెళ్లాడు' సినిమాలో కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ ను అనుకున్నాను. కానీ అది రామోజీరావుగారికి ఎంత మాత్రం ఇష్టం లేదు. రాజేంద్ర ప్రసాద్ ను బాగా చూపిస్తానని రామోజీరావుగారికి బలంగా చెప్పాను. అప్పుడు ఆయన అయిష్టంగా ఒప్పుకున్నారు. ఆ తరువాత రాజేంద్రప్రసాద్ ఫొటోలు తీయించి రామోజీరావుగారికి పంపిస్తే, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 

మండపేట సమీపంలో బ్రిటీష్ వాళ్ల కాలంనాటి హాస్పిటల్ ఒకటుంది. 'ప్రేమించు పెళ్లాడు' సినిమా షూటింగు అక్కడ జరుగుతుండగా, భానుప్రియ వాళ్లమ్మగారు అక్కడికి వచ్చారు. భానుప్రియ ఆ హాస్పిటల్లోనే పుట్టిందని చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. భానుప్రియకి కూడా అక్కడికి వచ్చిన తరువాతనే ఆ విషయం తెలిసిందట" అని అన్నారు.

  • Loading...

More Telugu News