KTR: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ మృతి బాధ కలిగించింది: కేటీఆర్

Saddened to hear of the demise of Susan Wojcicki
  • అమెతో పలు సందర్భాలలో మాట్లాడటం ద్వారా ఎంతో నేర్చుకున్నానన్న కేటీఆర్
  • సుసాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్న కేటీఆర్
  • రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ సుసాన్ మృతి
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజిస్కీ మరణం బాధ కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. అత్యంత డైనమిక్‌గా ఉండే సుసాన్ ఎంతో తెలివైన వారన్నారు. ఆమెతో పలు సందర్భాలలో మాట్లాడటం ద్వారా ఎంతో నేర్చుకున్నట్లు సిరిసిల్ల ఎమ్మెల్యే తెలిపారు. సుసాన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గతంలో ఆమెను కలిసిన ఫొటోను ట్వీట్ చేశారు.

56 ఏళ్ల సుసాన్‌ రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ శనివారం మృతి చెందారు. ఇంటర్నెట్‌ను రూపొందించడంలో, గూగుల్ చరిత్రలో ఆమె విశేష పాత్ర పోషించారు. 1990లో గూగుల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి... యూట్యూబ్‌ సీఈవో అయ్యారు. 2014 నుంచి 2023 వరకు సీఈవోగా ఉన్నారు.
KTR
YouTube
Telangana
Google

More Telugu News