Amazon: హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ.. ఫలించిన మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు

Amazon Web Services to expand data centre operations in Hyderabad

  • కాలిఫోర్నియాలో అమెజాన్‌తో మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు ఫలవంతం
  • అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ
  • అమెజాన్‌‌కు హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ భవనం

హైదరాబాద్ తన సేవలను మరింతగా విస్తరించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐ/ఎంఎల్ సేవల కోసం కొత్తగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ ఏర్పాటుతోపాటు మరిన్ని సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. డేటా సెంటర్ సౌకర్యాలతోపాటు వర్క్‌ఫోర్స్‌ను విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. 

కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ ఉపాధ్యక్షుడు కెర్రీ పర్సన్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ కార్యకలాపాలకు పటిష్టమైన ఊతం ఇస్తామని ఒప్పించారు. 

హైదరాబాద్‌లో అమెజాన్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ భవనం ఉంది. అమెజాన్ తన డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ను గతేడాది హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్‌ను వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుంది. ఇక్కడ ఇప్పటికే మూడు అతిపెద్ద డేటా సెంటర్లు పనిచేస్తున్నాయి. 

అమెజాన్ ప్రతినిధులతో సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లో వారి లక్ష్యాలను విజయవంతం చేసేందుకు ప్రోత్సహకాలు అందించడంతోపాటు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.   

  • Loading...

More Telugu News