Sarabjot Singh: ప్రభుత్వ ఉద్యోగ ఆఫర్‌ను తిరస్కరించిన ఒలింపిక్స్ విజేత సరబ్‌జ్యోత్ సింగ్

Sarabjot sing rejects haryana govt job offer
ఒలింపిక్స్ షూటింగ్‌లో కాంస్య పతకం సాధించిన 22 ఏళ్ల సరబ్‌‌జ్యోత్ హర్యానా ప్రభుత్వ ఉద్యోగ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం తన దృష్టి షూటింగ్ పైనేనని స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌లో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన సరబ్‌జ్యోత్‌కు హర్యానా ప్రభుత్వం క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ హాదాను ఆఫర్ చేసింది. దీనిపై సరబ్‌జ్యోత్ స్పందిస్తూ.. ‘‘ఇది మంచి ఉద్యోగమే, కానీ ఇప్పుడు నాకు కుదరదు. షూటింగ్ పైనే నేను ఎక్కువ దృష్టిపెట్టాలని భావిస్తున్నాను. మంచి ఉద్యోగంలో స్థిరపడమని నా కుటుంబం కూడా కోరుతోంది. కానీ నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లలేను. ఇప్పుడు ఉద్యోగం చేయలేను’’ అని స్పష్టం చేశారు.
Sarabjot Singh
Haryana Government
Job

More Telugu News