TGSRTC: మ‌హిళ‌ల‌కు టీజీఎస్ఆర్‌టీసీ గుడ్‌న్యూస్‌

TGSRTC good news to Women regarding Rakhi Festival

  • ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ 
  • దూర ప్రాంతాల్లోని త‌మ సోద‌రుల‌కు రాఖీలు పంపేందుకు వీలుగా కార్గో సెంట‌ర్ల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్లు
  • కార్గో సెంట‌ర్ల‌లో బుక్ చేసిన 24 గంట‌ల్లోనే రాఖీల‌ను డెలివ‌రీ చేసే విధంగా చ‌ర్య‌లు

ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు టీజీఎస్ఆర్‌టీసీ తీపి క‌బురు అందించింది. దూర ప్రాంతాల్లో ఉన్న‌ త‌మ సోద‌రుల‌కు సోద‌రీమ‌ణులు రాఖీలు పంపేందుకు వీలుగా పండుగ‌కు నాలుగైదు రోజుల ముందుగానే కార్గో కేంద్రాల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్లు తెర‌వాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం అన్ని బ‌స్టాండ్ల‌లోని కార్గో సెంట‌ర్ల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. 

రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు కూడా పంపే అవ‌కాశం క‌ల్పించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవ‌చ్చ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు. 

కార్గో సెంట‌ర్ల‌లో బుక్ చేసిన 24 గంట‌ల్లోనే రాఖీల‌ను డెలివ‌రీ చేసే విధంగా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. అయితే, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాలేదు. ధ‌ర‌ల‌ విష‌యంలో ఎల్లుండి స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News