Rahul Gandhi: పక్క పక్కనే కూర్చొని... ఆప్యాయంగా పలకరించుకున్న మోదీ, రాహుల్ గాంధీ!

A Tea Meeting Attended By PM Modi Rahul Gandhi

  • ప్రధానికి కుడి పక్కన స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత రాహుల్ గాంధీ
  • రాహుల్ గాంధీ పక్కనే కూర్చున్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
  • రాహుల్ గాంధీకి ఎదురుగా కూర్చున్న అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్

ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నేడు లోక్ సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ కాంప్లెక్స్‌లో 'టీ మీట్' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకింత పక్కపక్కనే కూర్చున్న మోదీ, రాహుల్ గాంధీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఆగస్ట్ 12న ముగియాల్సి ఉన్నాయి. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు.

ఈ సమావేశానికి హాజరైన వారు ఒకరినొకరు ఆప్యాయంగా, నవ్వుతూ పలకరించుకున్నారని సమావేశానికి హాజరైన సభ్యులు ఎన్డీటీవీతో చెప్పారు. నమస్తే అంటూ పలకరించుకున్నట్లు చెప్పారు.

ప్రధాని మోదీ సోఫాలో కూర్చున్నారు. ఆయన పక్కన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూర్చున్నారు. ప్రధానికి కుడివైపున స్పీకర్ తర్వాత రాహుల్ గాంధీ కూర్చున్నారు. 

కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, పీయుష్ గోయల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమొళి తదితరులు రాహుల్ గాంధీ వరుసలో కూర్చున్నారు. రాహుల్ గాంధీ పక్కనే కిరణ్ రిజిజు ఉన్నారు. అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు మోదీకి ఎడమవైపు... ప్రతిపక్ష నేతకు ఎదురుగా కూర్చున్నారు. వీరంతా మాట్లాడుకుంటున్న సమయంలో ఓ సర్వర్ ట్రేలో టీతో వచ్చారు.

  • Loading...

More Telugu News