YSRCP: ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి నేడు బెంగళూరుకు మాజీ సీఎం జగన్!

Former CM YS Jagan to Bengaluru today


మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి పర్యటన ముగిసిన తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. మూడు నాలుగు రోజులపాటు అక్కడే బస చేయవచ్చునని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 

కాగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పదేపదే బెంగళూరు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదివరకు రెండు సార్లు జగన్ బెంగళూరు వెళ్లి రావడం గమనార్హం. ఇదిలావుంచితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొందరిని బెంగళూరులో క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే.

YSRCP
YS Jagan
Andhra Pradesh
Bengaluru
  • Loading...

More Telugu News