Pawan Kalyan: హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్ర‌లు చేస్తున్నారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు!

Deputy CM Pawan Kalyan Senstional Comments on Heros

  • క‌ర్ణాట‌క‌లో మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • 40 ఏళ్ల క్రితం హీరో అనేవాడు అడ‌వుల‌ను కాపాడే వాడని వ్యాఖ్య‌
  • ఇప్పుడు అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడన్న జ‌న‌సేనాని
  • ఇలాంటి చిత్రాల్లో న‌టించ‌డానికి తాను చాలా ఇబ్బంది ప‌డ‌తాన‌న్న‌ ప‌వ‌న్‌

క‌ర్ణాట‌క వెళ్లిన‌ ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా సినిమాల్లో హీరోలు చేస్తున్న పాత్ర‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అనేవాడు అడ‌వుల‌ను కాపాడే వాడని, కానీ ఇప్పుడు ఆ అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. మారిన క‌ల్చ‌ర్ ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నారు. సినిమా రంగానికి చెందిన వాడిగా ఇలాంటి చిత్రాల్లో న‌టించ‌డానికి తాను చాలా ఇబ్బంది ప‌డ‌తాన‌ని ప‌వ‌న్‌ తెలిపారు.   

కాగా, గురువారం క‌ర్ణాట‌క‌ వెళ్లిన ప‌వ‌న్ ... ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయిన విష‌యం తెలిసిందే. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై ఆయ‌న‌తో పవన్ చర్చించారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన‌ట్లు స‌మాచారం. 

అలాగే ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని పవన్ క‌ల్యాణ్‌ కోరారు.

More Telugu News