Waqf Bill: లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు... విపక్షాల డిమాండ్‌తో జేపీసీకి బిల్లు!

Centre sent Waqf bill to Joint Parliamentary committee

  • వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే
  • బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు 
  • 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలపగా, కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. వైసీపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. దీనిని జేపీసీకి పంపిస్తామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు బిల్లును తీసుకువచ్చారు. దీని ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పాదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయనున్నారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకోనున్నాయి.

ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ సవరణలు చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. సచార్ కమిటీ సిఫార్సులోని అంశాలనే బిల్లులో పొందుపరిచినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. 1976లోని ఎంక్వయిరీ రిపోర్ట్ వక్ఫ్ బోర్డులోని అక్రమాలను బయటపెడుతోందన్నారు. వక్ఫ్ బోర్డులకు రావాల్సిన ఆదాయం సరిగ్గా రావడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయాలపై అందరికీ అవగాహన ఉందన్నారు. అయితే, ఈ బిల్లు దారుణమైనదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

  • Loading...

More Telugu News