Girlfriend: గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం కోసం త‌ల్లి బంగారం చోరీ.. చివ‌రికి జ‌రిగింది ఇదీ!

Class 9 boy steals mother gold to gift girlfriend Apple iPhone

  • ఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ఢ్‌లో ఘ‌ట‌న‌
  • తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలుడి నిర్వాకం
  • త‌న‌తో పాటు చ‌దివే అమ్మాయితో ప్రేమాయ‌ణం
  • ఆమె బ‌ర్త్‌డేకు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాల‌ని ఇంట్లోని అమ్మ బంగారం దొంగ‌త‌నం

ఓ మైన‌ర్ బాలుడు త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్ కొనిచ్చేందుకు త‌న త‌ల్లి బంగారాన్నే చోరీ చేశాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ఢ్‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే ఓ మ‌హిళ ఆగ‌స్టు 3న‌ త‌న బంగారాన్ని  దొంగిలించారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఒక జత ప‌సిడి చెవిపోగులు, ఉంగరం, గొలుసు కనిపించడం లేద‌ని ఫిర్యాదులో పేర్కొంది.  

ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో వారి ఇంటిముందున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ప‌రిశీలించారు. కానీ, వారి ఇంట్లోకి ఎవరూ రాలేదని, బయటకు వెళ్లలేదని గుర్తించారు. దాంతో అనుమానంతో ఇంట్లో ఉండే ఆమె మైన‌ర్‌ కుమారుడిపై పోలీసులు నిఘా పెట్టారు. ఒక పోలీసు బృందం అత‌ని సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది. అందులో భాగంగా అతని పాఠశాల స్నేహితులను ప్రశ్నించింది. 

ఆ స‌మ‌యంలో బాలుడు ఇటీవ‌ల రూ. 50 వేలు ఖ‌రీదు చేసే కొత్త ఐఫోన్‌ కొనుగోలు చేసినట్లు పోలీసుల‌కు తెలిసింది. దాంతో పోలీసుల అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డింది. ధర్మపురా, కక్రోలా, నజాఫ్‌గఢ్ ప్రాంతాల్లో న‌గ‌ల దుకాణాల్లో ద‌ర్యాప్తు చేశారు. కానీ, ఎక్క‌దా వారికి ఎలాంటి స‌మాచారం దొర‌క‌లేదు. ఈ క్ర‌మంలో త‌మ‌కు బాలుడు బంగారం విక్ర‌యించిన‌ట్లు చిన్న క్లూ దొరికింద‌ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) అంకిత్ సింగ్ తెలిపారు.

దాంతో బాలుడు ఇంటికి రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌ని వ‌ద్ద నుంచి యాపిల్ ఐఫోన్‌ను కూడా స్వాధీనం చేశారు. అనంత‌రం అత‌డిని పోలీసులు విచారించారు. దాంతో తాను నజాఫ్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నానని చెప్పాడు. తన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడని, తనకు చదువుపై ఆసక్తి లేదని తెలిపాడు.

అలాగే త‌న‌తో పాటు చ‌దివే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్న‌ట్లు చెప్పాడు. ఆమె పుట్టిన‌రోజు కావ‌డంతో అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు బ‌హుమ‌తిగా ఐఫోన్ కొనివ్వ‌డంతో పాటు బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు కొంత డ‌బ్బు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నానని, ఇదే విష‌యం ఇంట్లో త‌ల్లికి చెప్పానన్నాడు. కానీ, ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌ని, ముందు చ‌దువుపై శ్ర‌ద్ధ పెట్టాల్సిందిగా కోరిందని చెప్పాడు. 

దాంతో ఎలాగైనా గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాల‌నుకున్న అత‌డు.. ఇంట్లో ఉన్న అమ్మ న‌గ‌ల‌ను దొంగిలించి వాటిని విక్ర‌యించాడు. అలా వ‌చ్చిన డ‌బ్బుల‌లో రూ. 50వేలు పెట్టి ఐఫోన్ కొనుగోలు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాలుడి స‌మాచారం మేర‌కు కమల్ వర్మ అనే స్వర్ణకారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News