Telangana: రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy rains in Telangana districts

  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
  • నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు
  • కరీంనగర్ సహా పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు

రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. నేడు, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News