Sundar c menon: కటకటాల పాలైన పద్మశ్రీ అవార్డు గ్రహీత

The Padma Shri awardee who is behind bars

  • ఆర్ధిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్ సీ మీనన్ అరెస్టు
  • న్యాయస్థానం రిమాండ్ ఉత్తర్వులతో జైలుకు తరలించినట్లు పేర్కొన్న పోలీసులు
  • వివిధ సెక్షన్ల కింద 18 కేసుల నమోదు

కేరళకు చెందిన ఓ వ్యాపార వేత్తను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. సాధారణంగా వ్యాపారవేత్తలు కొందరు ఆర్ధిక నేరాల కేసుల్లో అరెస్టు అవ్వడం, ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త ఆర్ధిక మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం, కోర్డు రిమాండ్ విధించడం హాట్ టాపిక్ అయ్యింది. అదీ ఎందుకు అంటే .. అరెస్టు అయిన వ్యాపారవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడం. 2016 లో పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యాపార వేత్త సుందర్ సీ మీనన్ పలు సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తుంటారు.
 
అయితే సుందర్ సీ మీనన్, మరి కొందరు తమ సంస్థల పేరుపై 62 మందికిపైగా ఇన్వెస్టర్ ల నుంచి రూ.7.78 కోట్ల డిపాజిట్లు తీసుకుని, స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివిధ సెక్షన్ ల కింద 18 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. కేరళ క్రైమ్ బ్రాంచ్ అధికారులు కేసు దర్యాప్తు క్రమంలో భాగంగా సుందర్ సీ మీనన్ ను అరెస్టు చేశారు. ఆర్ధిక మోసం కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లుగా కోర్టుకు నివేదించారు. అతనికి కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News