Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయంపై బ్రిటన్ ఏం చెబుతోంది?

What UK Said On Sheikh Hasina Asylum Reports

  • బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా
  • యూకేలో ఆశ్రయం కోరిన షేక్ హసీనా
  • ఆశ్రయం కోరిన వ్యక్తులకు రక్షణ కల్పించడంలో బ్రిటన్ కు టాప్ రికార్డ్

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా ఏకంగా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో తలదాచుకున్నారు. ఆమె ఇక్కడి నుంచి లండన్ వెళ్లవలసి ఉంది. అయితే ఇమ్మిగ్రేషన్ కారణాలతో కొన్నిరోజులు భారత్‌లోనే ఉండనన్నారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా ఆమెకు అనుమతులు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.

షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరారు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ నియమాల ప్రకారం ఆశ్రయం పొందడానికి లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి వ్యక్తులకు అవకాశం లేదు. అయితే, ఆశ్రయం కోరిన వ్యక్తులకు రక్షణ కల్పించడంలో యూకేకు రికార్డ్ ఉందని యూకే అధికారులు చెబుతున్నారు. కానీ యూకే చట్టంలో మాత్రం అందుకు సంబంధించి నిబంధన మాత్రం లేదంటున్నారు.

సురక్షిత ఆశ్రయం కోరుకునే వారు తొలుత చేరుకున్న దేశంలోనే ఆశ్రయం అడగాలని, అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని యూకే హోం శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి అన్నారు. అయితే, ఆశ్రయం కోరుతూ అభ్యర్థన దాఖలు చేసుకుంటే, ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని బ్రిటన్ ప్రభుత్వ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

  • Loading...

More Telugu News