TDP Leaders: పార్లమెంట్ కీలక కమిటీల్లో టీడీపీ ఎంపీలకు చోటు

TDP leaders gets place in parliamentary committes
  • మాగుంట, వేమిరెడ్డి, లక్ష్మీనారాయణ, పార్ధసారధి, కృష్ణప్రసాద్ లకు పార్లమెంట్ కమిటీల్లో స్థానం
  • కేంద్రంలో టీడీపీకి ప్రాధాన్యత పెరిగిందని అంటున్న రాజకీయ వర్గాలు
  • ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ
ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరడంతో ఆ పార్టీ నేతలకు కేంద్రంలో ప్రాముఖ్యత పెరిగినట్లుగా కనబడుతోంది. ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండగా, తాజాగా, ఐదుగురు టీడీపీ ఎంపీలకు పార్లమెంట్ కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటు దక్కింది. 
 
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అంచనాల కమిటీలో పార్ధసారధి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే టీడీపీకి ఒక మంత్రిత్వ శాఖ స్థాయూ సంఘం చైర్మన్ పదవి కూడా లభించే అవకాశం ఉందని టాక్ నడుస్తొంది. 

ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మనుగడ చంద్రబాబు, నితీశ్ పై ఆధారపడి ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు.
TDP Leaders
Parliamentary Committes
TDP
Andhra Pradesh

More Telugu News