Sheikh Hasina: షేక్ హసీనాకు భారత్ లో తాత్కాలిక ఆశ్రయమే!

Reports saying Indian government has granted former Bangladesh Prime Minister Sheikh Hasina an interim stay

  • యూకే ప్రభుత్వం అనుమతి ఇచ్చేవరకు భారత్‌లోనే బస చేసే అవకాశం
  • అనుమతి కోసం ఎదురుచూస్తున్న షేక్ హసీనా
  • అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు

రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలతో దేశం అల్లకల్లోలంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భద్రత కోసం పక్కనే ఉన్న భారత్‌కు ఆమె నిన్ననే (సోమవారం) వచ్చారు. అయితే ఆమె ఇక్కడ తాత్కాలిక నివాసం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో ఆమె నివాసానికి తాత్కాలిక ఆమోదం మాత్రమే లభించిందని, యూకేలో రాజకీయ ఆశ్రయం అంశం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని పేర్కొంది.

హసీనా యూకేలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారని, అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి దక్కే వరకు ఆమె భారత్‌లోనే ఉంటారని ‘డైలీ సన్’ కథనం పేర్కొంది. షేక్ హసీనా రాజకీయ ఆశ్రయం విజ్ఞప్తికి సంబంధించి ప్రస్తుతానికి యూకే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ లేదని పేర్కొంది. హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారని ‘డైలీ సన్’ కథనం పేర్కొంది. కాగా హసీనాకు భారత్ పూర్తి ప్రయాణ సహకారం అందించనుందని వివరించింది.

షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా రెహానా కూతురు తులిప్ సిద్ధిక్ బ్రిటీష్ పార్లమెంటు ఎంపీగా ఉన్నారు. యూకేలో లేబర్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదివుంచితే బంగ్లాదేశ్‌లో వేగంగా మారిపోతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం రాత్రి భేటీ అయింది. 

  • Loading...

More Telugu News